347 మంది పారిశుద్ధ్య కార్మికుల అకాల మరణం

347 మంది పారిశుద్ధ్య కార్మికుల అకాల మరణం

న్యూఢిల్లీ : గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 347 మంది పారిశుద్ధ్య కార్మికులు వేర్వేరు ఘటనల్లో అకాల మరణం చెందారు. ఈ మరణాలు ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ నమోద య్యాయని లోక్సభ లో సభ్యులు సుబ్రాత్ పథాక్, మనోజ్ తివారీ అడిగిన ప్రశ్నలకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రి విరేంద్ర కుమార్ సమాధానమిచ్చారు. మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంకుల క్లీనింగ్ సమయాల్లో ప్రమాదాలు, విషవాయువులు లీకవ్వడం ఇందుకు కారణమని వివరించారు. గత ఐదేళ్ల కాలంలో అత్యధికంగా 2019లో 116 మంది చనిపోయారు. 2017లో 92 మంది ఇలా మృత్యువాతపడ్డారు. ఉత్తరప్రదేశ్లో అధికంగా 51 మంది, తమిళనాడులో 48 మంది, ఢిల్లీలో 44 మంది కన్నుమూశారు. 2019లో ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి. ఇందులో సెప్టెక్ ట్యాంకు ఘటనల్లో 26 మంది ప్రాణాలు వదిలారు. 2022 లో 17 మంది కార్మికులు చనిపోయారు. అధికంగా తమిళనాడులో ఐదుగురు, ఉత్తరప్రదేశ్ నలుగురు కన్నుమూసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos