స్టైలిష్ స్టార్-సూపర్‌స్టార్‌ ఢీ అంటే ఢీ..

  • In Film
  • October 13, 2019
  • 123 Views
స్టైలిష్ స్టార్-సూపర్‌స్టార్‌ ఢీ అంటే ఢీ..

సంక్రాంతి అంటే తెలుగు ప్రజలకు ఎంతో ప్రత్యేకం.మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పండుగ కోలాహలం నెలకొంటుంది.ఇక గోదావరి,కృష్ణా జిల్లాల్లో అయితే కోడి పందేల గురించి చెప్పాల్సిన అవసరం లేదు.ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ కూడా సంక్రాంతికి చిత్రాలు విడుదల చేయడాన్ని ఆనవాయితీగా పాటిస్తోంది.స్టార్ హీరోల చిత్రాలు ఎక్కువగా సంక్రాంతి రోజునే బరిలో దిగుతాయి.ఈ క్రమంలో వచ్చే ఏడాది సంక్రాంతి రోజున రెండు భారీ చిత్రాలు కోడిపుంజుల్లా ఢీకొట్టడానికి రెడీ అవుతున్నాయి.మహేశ్ నటించిన సరిలేరు నీకెవ్వరు,అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో చిత్రాలు ఒకేరోజు విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటనలు వెలువడ్డాయి.రెండు చిత్రాలు జనవరి 12న రిలీజ్ తేదీని ఫిక్స్ చేసుకున్నాయి.అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురములో రిలీజ్ డేట్ వచ్చిన కొన్ని నిమిషాలకే మహేష్ సరిలేరు నీకెవ్వరు రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు.దీంతో సంక్రాంతి బరిలో పోటీ పడనున్న ఈ రెండు చిత్రాల్లో గెలిచేదెవరో చూడాలంటే సంక్రాంతి వరకు ఆగాలి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos