అందరిచూపు మహారాష్ట్ర రాజ్​భవన్​ వైపే

అందరిచూపు మహారాష్ట్ర రాజ్​భవన్​ వైపే

ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే రాజీనామాతో రాజకీయ సంక్షోభం ముగిసింది. భాజపాకు శిందే వర్గం మద్దతు ఇస్తున్నందున అడ్డంకులు లేకుండా కొత్త ప్రభు త్వం ఏర్పాటు కానుంది. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ కోష్యారీ భాజపాను ఎప్పుడు ఆహ్వానిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా గవర్నర్ను సంప్రదించే విషయంపై చర్చించేందుకు భాజపా కోర్ కమిటీ సమావేశమైంది. శిందేకు ఉపముఖ్యమంత్రి పదవిని కేటాయించ నున్నట్లు కథ నాలు వెలువడుతున్నాయి. శుక్రవారం కొత్త మంత్రి వర్గం కొలువు దీరే అవకాశాలున్నాయి. తిరుగుబాటు దార్లలో 12 మందికి మంత్రి పదవులు దక్కే అవకాశముంది. 170 మంది సభ్యుల మద్దతు ఉందని భాజపా చెబుతోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా ప్రస్తుతం గోవాలోనే ఉన్నారు. గురువారం వారు సమావేశమయ్యారు. ఠాక్రేపై తిరుగు బాటు చేసిన తర్వాత అసలైన శివసేన వర్గం తమదేనని శిందే చెబుతున్న విషయం తెలిసిందే. శాసనసభాపక్ష నేత హోదాలో సమావేశం నిర్వహించడం గమనార్హం. సాయంత్రం వారు ముంబయి చేరుకునే అవకాశాలు న్నాయి. మంత్రి పదవులపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని శిందే ట్విట్టర్ వేదికగా సూచించారు. మంత్రి పదవు లపై భాజపాతో ఇంకా చర్చించలేద న్నారు. త్వరలోనే భాజపాతో చర్చలు జరుపుతామని ట్వీట్ చేశారు.అప్పటివరకూ ఊహగానాలను నమ్మవద్దని కోరారు. తిరుగు బాటు ఎమ్మెల్యేలు బస చేస్తున్న హోటల్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos