మహా పరీక్ష రేపు

మహా పరీక్ష రేపు

న్యూ ఢిల్లీ: మహారాష్ట్ర శాసనసభలో బుధవారం సాయంత్రం ఐదు గంటల్లోపు బల పరీక్షను బహిరంగ పద్దతిలో పూర్తి చేయాలని అత్యన్నత న్యాయస్థానం మంగళవారం ఆదేశించింది. ఇందుకు అనువుగా తాత్కాలిక సభాపతిని నియమించాలని సూచిం చింది. బుధవారం ఉదయం నుంచి ఆయన శాసనసభ ఎన్నికల్లో నెగ్గిన అభ్యర్థలచే చట్టసభ సభ్యులుగా ప్రమాణాల్ని చేయి స్తారు.తర్వాత బల పరీక్ష నిర్వహిస్తారు. విశ్వాస పరీక్షను చిత్రీకరించాలని కూడా సూచించింది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితిలో రాజ్యాంగ నైతికతను అన్ని రాజకీయ పక్షాలు కాపాడాలాని ధర్మాసనం పిలుపు నిచ్చింది. భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అవకాశం ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తులు ఎన్.వి. రమణ, అశోక్ భూషణ్, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి ఆదేశాన్ని జారీ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos