ప్రకృతి అందాల ఒడి మడికేరి..

  • In Tourism
  • November 30, 2019
  • 323 Views
ప్రకృతి అందాల ఒడి మడికేరి..

కర్ణాటక జిల్లాలో ప్రకృతి అందాల ఒడిలో ఒదిగిఉన్న అందమైన పట్టణాల్లో ఒక పట్టణం కొడగు జిల్లాలోని మడికేరి పట్టణం.కేరళ రాష్ట్ర సరిహద్దు కూడా సమీపంలోనే ఉండడంతో మడికేరిలో కర్ణాటక-కేరళ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు కనిపిస్తాయి.కర్ణాటకలో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే మడికేరి ప్రజల ఆచారవ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు కొంచెం భిన్నంగా ఉంటాయి.పురుషులు కుప్య అనే వస్త్రాలు ధరిస్తారు (ప్రస్తుతం పండుగలలో మాత్రమే ధరిస్తున్నారు). ఆడవారు ప్రత్యేకమైన శైలిలో చీర లను ధరిస్తారు. వీరికి కత్తులు పట్టుకోవటం, యుద్ధ విన్యాసాలతో కూడిన నృత్యాలు చేయటం అంటే మహా సరదా ! కుటుంబ సమేతంగా వైన్‌ తాగటం, నృత్యాలు చేయటం మరియు మాంగోస్టీన్ తో కూడిన మాంసాహారాలు ఇక్కడి ప్రధాన వంటకాలు.మడికేరి లో చూడవలసిన పర్యాటక అందాలు చాలానే ఉన్నాయి. ఒక్కో ప్రదేశం ఒక్కో అనుభూతిని కలిగిస్తుంది.రాజు గారి కోట, రాజు గారి సమాధి స్థలం, రాజాస్ సీట్, అబ్బే ఫాల్స్, నీలకంఠ స్వామి గుడి, తలకావేరి, భాగమండలం చూడదగ్గవి. ముందుగా మడికేరి లోని పర్యాటక స్థలాలను చూద్దాం పదండి.

రాజుగారి కోట :
రాజుగారి
కోటను మడికేరి కోట అని కూడా పిలుస్తారు. కోట ను మట్టితో నిర్మించారు. కోట లోపలి భాగంలో అందమైన ప్యాలెస్, వీరభద్ర గుడి కలదు. ప్యాలెస్ తాబేలు ఆకారంలో కనిపిస్తుంది. రెండు పెద్ద ఏనుగు రాతి విగ్రహాలు పాలెస్‌ను కాపలా కాస్తున్నట్లు ఉంటాయి. కోట చుట్టుపక్కల జైలు, మహాగణపతి దేవాలయం, ఎం జి పబ్లిక్ లైబ్రేరి లు చూడదగ్గవిగా ఉన్నాయి. గణపతి దేవాలయంలో దసరా ఘనంగా నిర్వహిస్తారు..

మడికేరి కోట

తలకావేరి :
మడికేరి నుంచి 43 కిలోమీటర్ల దూరంలో దట్టమైన పశ్చిమ కనుమల అడవుల్లో ఉన్న తలకావేరి జీవనది కావేరి నదికి జన్మస్థలం.పర్యాటకంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా తలకావేరి ప్రసిద్ధి చెదండంతో ప్రతిరోజూ వేలాది మంది ఇక్కడకు వస్తుంటారు.తలకావేరిలో స్నానమాచరించి అగస్తేశ్వర
దేవాలయాన్ని దర్శిస్తారు.ప్రతి సంవత్సరంల అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో తలకావేరిలో నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు,భక్తులు తరలివస్తుంటారు..

తలకావేరి

భాగమండల :
మడికేరి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాగమండల కూడా ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటకంగా కూడా ప్రసిద్ధి చెందింది.ఇదే ప్రాంతంలో కావేరి నదిలో ఉపనదులు కన్నికె,సుజ్యోతి నదులు కలుస్తాయి.అందుకే ఈ ప్రాంతాన్ని త్రివేణి సంగమం అని కూడా పిలుస్తుంటారు.ఇక్కడ
భగందేశ్వర దేవాలయం కలదు. ఆలయం లోపల భగంధేశ్వరుడు, గణపతి, విష్ణు, సుబ్రమణ్య విగ్రహాలు ఉన్నాయి. దేవాలయాన్ని కేరళ శిల్ప శైలిలో నిర్మించారు.

త్రివేణి సంగమం

రాజాస్ సీట్ :
మడికేరిలో తప్పకుండా చూడాల్సిన మరో పర్యటక ప్రదేశం రాజాస్‌ సీట్‌.ప్రకృతి అందాలు,ఎత్తైన కొండలు,తేలియాడే మబ్బుల మధ్య ఇక్కడి నుంచి సూర్యోదయం,సూర్యాస్తమయం ఎంతో కనువిందుగా ఉంటుంది.అందుకే కొడగు రాజులు ఇక్కడ కూర్చొని సూర్యోదయం, సూర్యాస్తమయం చూడడానికి అమితాసక్తి చూపేవారు.ఈ క్రమంలో నాలుగు స్తంబాలతో చతురస్రాకారంలో ప్రత్యేకంగా గదిని నిర్మించారు.అప్పుడప్పుడూ సతీసమేతంగా కొడగు రాజులు ఇక్కడికి వచ్చి సేద తీరేవారు.ఈ ప్రాంతంలోని పూల చెట్లు,అందమైన ఫౌంటెన్ లతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. సాయంత్రం ఫౌంటెన్ నుండి వచ్చే సంగీతం, రంగురంగుల నీటి ధారలు వినోదం కలిగిస్తాయి..

రాజాస్ సీట్

అబ్బే జలపాతాలు :
అబ్బే
జలపాతం మడికేరికి పది కిలోమీటర్ల దూరంలో కలదు. కావేరి నది వేగంగా ప్రవహిస్తూ కొండపై నుండి లోయలోకి దూకే క్రమంలో జలపాతంగా మారుతుంది. ఇక్కడ ఒక వ్రేలాడే వంతెన ద్వారా జలపాతాన్ని దగ్గరి నుండి వీక్షించవచ్చు. మడికేరి నుండి సన్నటి రోడ్డు మార్గం ద్వారా జలపాతానికి చేరుకోవచ్చు.కాఫీ తోటలు,సుగంధ ద్రవ్యాల తోటల్లో పరిమళించే సువాసనల మధ్య ప్రయాణిస్తూ అబ్బే జలపాతం చేరుకోవడం మరచిపోలేని అనుభూతి కలిగిస్తుంది..

అబ్బే జలపాతాలు

టిబెటియన్ కాలనీ:
మడికేరి పట్టణం దశాబ్దాలుగా టిబెటియన్లకు ఆశ్రయంగా విరాజిల్లుతోంది.అందుకే ఇక్కడి టిబెటియన్ల గుడి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.మడికేరి నుండి కమలానగర్ చేరుకున్న తరువాత అక్కడి నుండి పక్కన రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే బౌద్ధుల కేంద్రం టిబెట్టియన్ కాలనీ కనిపిస్తుంది. మార్గ మధ్యలో బౌద్ధుల ఆహారంమొక్కజొన్నపొలాలు కనిపిస్తాయి.

బౌద్ధుల కేంద్రం

ఓంకారేశ్వర ఆలయం :
ఓంకారేశ్వర
ఆలయం, మడికేరి పట్టణం మధ్య భాగంలో కలదు. ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఇక్కడి శివలింగాన్ని రాజు లింగరాజేంద్ర కాశీ నుండి తీసుకొని వచ్చి ప్రతిష్టించాడని చెబుతారు. టిప్పు ప్రాంతం పై దండెత్తి పాలించడం కారణంగా ఆలయ నిర్మాణం ఇస్లాం నిర్మాణ శైలిని పోలి ఉంటుంది..

ఓంకారేశ్వర ఆలయం

రాజు గారి సమాధి :
రాజుగారి సమాధిని గద్దిగె అంటారు. రాజు దొడ్డ వీర రాజేంద్ర మరియు అతని రాణి సమాధులు ఇక్కడ ఉన్నాయి. వీటిని ఇండో సార్కానిక్ శైలిలో నిర్మించారు. మధ్యలో నాలుగు స్తంభాల ఆధారంగా కేంద్ర గోపురాన్ని నిర్మించారు. కుడి గోపురం రాజు లింగ రాజేంద్ర ది కాగా, ఎడమ గోపురం పురోహితుడు రుద్రప్పది.
ఎలా చేరుకోవాలి..

రాజు గారి సమాధి

బెంగళూరు నుంచి రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా నేరుగా మడికేరికి చేరుకోవచ్చు.లేదా మైసూరుకు చేరుకొని అక్కడి నుంచి ప్రభుత్వ,ప్రైవేటు వాహనాల్లో సైతం మడికేరికి చేరుకోవచ్చు..

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos