తెలుగు సినిమాల్లో మన వారికే అవకాశాలు

  • In Film
  • August 19, 2019
  • 107 Views
తెలుగు సినిమాల్లో మన వారికే అవకాశాలు

హైదరాబాద్ : తెలుగు సినిమాల్లో తెలుగు వారికే అవకాశాలివ్వాలని, మా సభ్యులుగా ఉంటూ అవకాశాలు లేని నటులను ప్రోత్సహించాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేశ్ కోరారు సోమవారం ‘మా’ తరఫున తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం, నిర్మాతల మండలి, రచయితల సంఘం అధ్యక్షులకు వినతిపత్రాలు అందజేశారు. ఆయా సంఘాల తరఫున ఎన్.శంకర్, సి.కల్యాణ్, వై.సుప్రియ, పరుచూరి గోపాలకృష్ణ వినతిపత్రాలను స్వీకరించారు. అనంతరం ‘మా’ ప్రధాన కార్యదర్శి జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ చాలా మంది మా సభ్యులు వేషాలు లేక ఖాళీగా ఉంటున్నారని, ముఖ్యంగా మహిళలు చాలా బాధల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి, అందులో నటుల వివరాలు, ఫోన్ నెంబర్లతో పాటు, వాళ్లు నటించిన ఒక వీడియోని కూడా ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ చిత్ర పరిశ్రమకు చెందిన నాలుగు సంఘాల్ని కలిసి వినతిపత్రం సమర్పించామని, వాళ్లు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మా కార్యవర్గానికి చెందిన హేమ, అలీ, రాజా రవీంద్ర, ఉత్తేజ్, సురేష్ కొండేటి, అనితా చౌదరి, జయలక్ష్మి, అశోక్‌ కుమార్క టార్జాన్ తదితరులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos