లాక్ డౌన్ సాధన శూన్యం

లాక్ డౌన్ సాధన శూన్యం

న్యూ ఢిల్లీ : కరోనా నివారణకు మోదీ సర్కారు చేపట్టిన చర్యలు తుస్సు మన్నాయి. లాక్ డౌన్ విఫలమైంద’ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శని వారం విమర్శించారు. ఇతర దేశాలతో పోల్చితే లాక్ డౌన్ ప్రకటించి మోదీ సర్కారు సాధించింది శూన్యమని వ్యాఖ్యానిం చారు. స్పెయిన్, జర్మనీ, ఇటలీ, యూకే దేశాలతో పోలుస్తూ భారత్ లో కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ వైఫల్యాన్ని వివరించిన రేఖా చిత్రాన్నీ రాహుల్ గాంధీ శనివారం ట్వీట్ చేసారు. ఆయా దేశాల్లో కరోనా క్రమంగా పెరుగుతూ ఉన్నప్పుడు లాక్ డౌన్ ప్రకటించి.. బాగా తగ్గుదల కనిపించినప్పుడు లాక్ డౌన్ ఎత్తివేసిన తీరును అందులో విడమర్చారు. మన దేశంలో కరోనా విజృంభించిన దశలో లాక్ డౌన్ ఎత్తి వేసిన తీరును విపులీ కరించారు. భారత్ లో 2.37 లక్షల మంది కరోనా పీడితులున్నారు. 1.14 లక్షల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. పది వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో తొలి లక్ష కేసులకు నెల రోజులకు పైగా సమయం పట్టగా, రెండో లక్ష కేసులు కేవలం రెండు వారాల సమయం లోనే నమోదయ్యాయని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos