తప్పు చేశామన్నమంత్రి జై శంకర్

న్యూ ఢిల్లీ: ఆఫ్ఘన్ మాజీ మహిళా పార్లమెంటు సభ్యులు రంగినా కర్గర్ ను అధికారులు ఢిల్లీ నుంచి తిప్పి పంపడం తమ తప్పిదంగా కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ అంగీకరించారని కాంగ్రెస్ నేత మల్లి కార్జున ఖర్గే శుక్ర వారం ఇక్కడ వెల్లడించారు. ‘ఇది దురదృష్టకరమైన ఘటన అని, అందుకు చింతిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కానివ్వబోము. అవసరమైతే ఆ మహిళా ఎంపీకి అత్యవసర వీసా మంజూరు చేస్తామని కేంద్రమంత్రి వెల్లడించారని ఈ మేరకు కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మీడియాకు వివరించారు. కేంద్రం తన హామీని ఎంతవరకు నిలుపుకుంటుందో చూస్తామని ఖర్గే అన్నారు. అఖిల పక్ష సమావేశంలో విపక్ష నేతలు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆగస్టు 20న ఢిల్లీకి వచ్చిన ఆమెను వలస విభాగం అధికార్లు రెండు గంటల పాటు విమానాశ్రయంలోనే బంధించి ఇస్తాంబుల్ కు తిప్పి పంపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos