ఆట మైదానం లేని బళ్లను మూసేయండి

ఆట మైదానం లేని బళ్లను మూసేయండి

తిరువనంతపురం: కేరళ హైకోర్టు ఇటీవల కఠిన తీర్పును ఇచ్చింది. సరైన ప్లేగ్రౌండ్ లేని స్కూళ్లను మూసి వేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేరళ ఎడ్యుకేషన్ రూల్స్ ప్రకారం స్కూళ్ల నిర్మాణం ఉండాలని ఆ తీర్పులో హైకోర్టు పేర్కొన్నది. జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ ఆ తీర్పును వెలువరించారు. చిన్న పిల్లల అభివృద్ధిలో ఆటలు ఎంతో ముఖ్య పాత్రను పోషిస్తాయని న్యాయమూర్తి తన తీర్పులో తెలిపారు. ఏప్రిల్ 11వ తేదీన ఓ కేసు విచారణ సందర్భంగా ఈ తీర్పును ఇచ్చారు. విద్యను క్లాస్రూంలకే పరిమితం చేయవద్దు అని, ఎడ్యుకేషన్ కరిక్యులమ్లో స్పోర్ట్స్, గేమ్స్ ఉండాలని, క్రీడల వల్ల పిల్లల్లో ఫిజికల్ స్కిల్స్ పెరుగుతాయని తీర్పులో చెప్పారు. బ్యాలెన్స్ మోటార్ స్కిల్స్, హ్యాండ్ ఐ కోఆర్డినేషన్, హార్ట్, లంగ్ ఫంక్షన్ తీరు బాగుటుందని తీర్పులో పేర్కొన్నారు. సోషల్, కాగ్నిటివ్, ఎమోషనల్ స్కిల్స్ కూడా పెరుగుతాయన్నారు. స్కూల్ గ్రౌండ్లో ఆడుకోవడం వల్ల.. క్లాస్రూంలో పిల్లలు వత్తిడి, ఆందోళనను తగ్గించుకోవచ్చు అని తీర్పులో తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos