నా పేరు అరవింద్‌ కేజ్రీవాల్‌, నేను టెర్రరిస్ట్‌ను కాదు.. జైలు నుంచి ఢిల్లీ సీఎం సందేశం

నా పేరు అరవింద్‌ కేజ్రీవాల్‌, నేను టెర్రరిస్ట్‌ను కాదు.. జైలు నుంచి ఢిల్లీ సీఎం సందేశం

న్యూ ఢిల్లీ : మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ సందేశాన్ని పంపినట్లు ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం విలేకరుల సమావేశంలో జైలు నుంచి సీఎం పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. ‘నా పేరు అరవింద్ కేజ్రీవాల్, నేను ఉగ్రవాదిని కాను’ అని కేజ్రీవాల్ సందేశాన్ని పంపినట్లు తెలిపారు.‘దేశం కోసం, ఢిల్లీ ప్రజల కోసం ఓ కొడుకు, సోదరుడిలా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్.. ‘నా పేరు అరవింద్ కేజ్రీవాల్, నేను ఉగ్రవాదిని కాను’ అంటూ జైలు నుంచి సందేశం పంపారు. మూడు సార్లు ఢిల్లీకి సీఎంగా ఎన్నికైన ఆయన్ని భగవంత్ మాన్ గ్లాస్ అద్ధం వెనుక నుంచి కలిశారు. కేజ్రీవాల్ పట్ల ప్రధాని ధ్వేష భావంతో ఉన్నట్లు దీన్ని బట్టే అర్థమవుతోంది’ అని సంజయ్ సింగ్ అన్నారు. జైల్లో కేజ్రీవాల్ను ఓ టెర్రరిస్ట్గా ట్రీట్ చేస్తున్నారని సంజయ్ సింగ్ ఆరోపించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం కేజ్రీని గాజు అద్ధం వెనుక నుంచి కలుసుకునేలా చేశారని దుయ్య బట్టారు. తమ సుప్రిమోను 24 గంటలూ నిరుత్సాహపరిచేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఢిల్లీకి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన కేజ్రీవాల్ పట్ల బీజేపీ వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఈ సందర్భంగా సంజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ను ఎంత విచ్ఛిన్నం చేస్తే అంతే బలంగా పైకి లేస్తారని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos