కేజ్రీవాల్‌కు థరూర్‌ క్షమాపణ

కేజ్రీవాల్‌కు థరూర్‌ క్షమాపణ

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి  కేజ్రీవాల్కు కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ మంగళవారం తెలివిగా కేజ్రీవాల్కు క్షమాపణ చెప్పారు. ఇంకా ఆయనకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యాల్ని ఉప సంహరించు కున్నారు. ‘కేజ్రీవాల్ చాలా తెలివిగా వ్యవహరి స్తు న్నారు. పౌరసత్వ చట్టాన్ని, జాతీయ పౌర పట్టికపై విమర్శించటమే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. హింస పై ఒక ముఖ్య మంత్రి చూపాల్సిన నిబద్ధతనూ చూపటం లేదు. ఇతర ప్రాంతాల్లో ఇలాంటి హింస జరిగితే ముఖ్యమంత్రులు బాధితుల్ని పరా మ ర్శించే వారు. కేజ్రీవాల్ బాధ్యతలు లేని అధికారాన్ని కోరుకుంటున్నారు. ఈ తరహా ప్రత్యేక అధికారాలు ఏళ్ల కిందట నపుం సకులు కోరుకునేవార’ని థరూర్ సోమవారం ఒక ఆంగ్ల మాధ్యమ సంస్థ ముఖాముఖిలో వ్యాన్యానించారు. వీటిపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ తరహా పదజాలంతో విమర్శించటం అసమంజసమని అసం తృప్తి చెందారు. క్షమాపణలకు డిమాండ్ చేసారు. ‘బాధ్యతలు లేని అధికారం అన్న నా వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉ న్నా యని భావించినవారందరికీ నా క్షమాపణలు. అది బ్రిటీష్ రాజకీయాల పాత సామెత. ప్రముఖ రచయిత కిప్లింగ్, బ్రిటన్ ప్రధాని స్టాన్లే బాల్డ్విన్ కాలంలో దీన్ని వాడారు. ఇటీవల రచయిత టామ్ స్టాపర్డ్ కూడా వాడారు. దీని ప్రయోగం ఇప్పుడు అస మంజసమని గుర్తించాను. నా వ్యాఖ్యని వెనక్కి తీసుకుంటున్నాన’ని స్పందించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos