వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు…

  • In Film
  • February 14, 2019
  • 213 Views
వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు…

కొద్ది రోజులుగా తమిళహీరో ఆర్య,హీరోయిన్‌ సాహేషాలు
గాఢమైన ప్రేమలో మునిగి తేలుతున్నారని త్వరలోనే ఇరువురి వివాహం చేసుకోనున్నారంటూ తమిళ
మీడియాలో జోరుగా జరుగుతున్న చర్చలకు తాజాగా హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలు  బలం చేకూర్చాయి.తమిళ సినీ మీడియాలో ఆర్య,సాహేషాల
ప్రేమపై కుప్పలుతెప్పలుగా వార్తలు,ఊహాగానాలు వినిపించినా వాటిపై స్పందించకుండా ఇరువురి
మౌనం పాటించారు.తాజాగా ఓ ఇంటర్‌వ్యూలో ఆర్య పెళ్లికి సంబంధించిన ప్రశ్నకు బదులిస్తూ
ప్రస్తుతం ఆర్య తన మాట వినడం లేదని కేవలం ఆ ఒక్కరి మాట మాత్రమే వింటున్నాడంటూ వ్యాఖ్యానించాడు.దీంతో
ఆ ఒక్కరు సాహేషాయేనని కార్తీ పరోక్షంగా వ్యాఖ్యానించి ఆర్య,సాహేషాల ప్రేమ విషయాన్ని
బహిర్గతం చేసాడు. నేడు కార్తి నటించిన ‘దేవ్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సందర్బంగా మీడియాతో మాట్లాడిన కార్తి తన స్నేహితులైన విశాల్,ఆర్యల పెళ్లిల గురించి మాట్లాడాడు.ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు కొన్ని మాట్లాడేందుకు విశాల్ అస్సలు దొరకడం లేదు హనీమూన్ అయిన తర్వాత అయినా దొరుకుతాడేమో చూడాలంటూ సరదాగా వ్యాఖ్యలు చేశాడు కార్తి. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos