థ్రిల్లింగ్‌గా కల్కి ట్రైలర్..

  • In Film
  • June 25, 2019
  • 177 Views
థ్రిల్లింగ్‌గా కల్కి ట్రైలర్..

దాదాపుగా దశాబ్దా కాలానికి పైగా హిట్టు అంటే ఎలా ఉంటుందో తెలియక పూర్తిగా ఫేడవుటైన రాజశేఖర్‌కు రెండేళ్ల క్రితం విడుదలైన గరుడవేగ చిత్రం సాధించిన విజయం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.గరుడవేగ హిట్‌తో తెలుగు ప్రేక్షకుల అభిరుచి మారిందని పసిగట్టిన రాజశేఖర్‌ తదుపరి చిత్రాన్ని కూడా థ్రిల్లర్‌ జోనర్‌లో చేయడానికి నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలో ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్‌ నటించిన కొత్త చిత్రం కల్కి ట్రైలర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ”ఆకాశవాణి.. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే నర్సప్ప తమ్ముడు శేఖర్‌బాబు దారుణ హత్య తర్వాత నర్సప్ప పెరుమాండ్ల వర్గీయుల మధ్య పరస్పర దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి” అంటూరేడియోలో వచ్చే వాయిస్ తో ట్రైలర్ మొదలైంది.నటుడు రాహుల్ రామకృష్ణ.. ‘శేఖర్ బాబుని ఎవరు చంపారు..?’ అంటూ కనిపించిన ప్రతీఒక్కరినీ అడుగుతూ ఆరాతీస్తుంటాడు. శేఖర్ బాబుని ఎవరు చంపారో తనకు తెలుసునని రాహుల్ రామకృష్ణ చెప్పడంతో.. ఎంక్వైరీ మొదలుపెడదాం అంటూ రాజశేఖర్ చెప్పడంతో ఇదొక హత్య నేపధ్యంలో సాగే సినిమాగా తెలుస్తోంది. డైరెక్టర్ చాలా ఇంటరెస్టింగ్ గా ట్రైలర్ ని కట్ చేశారు. కథ, నేపధ్యం, డైలాగ్స్ మొత్తం చూస్తుంటే ఈసారి కూడా రాజశేఖర్ హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos