భారత్‌ పై దాడికి ఇరాన్‌ కుట్ర

భారత్‌ పై దాడికి ఇరాన్‌ కుట్ర

వాషింగ్టన్: న్యూఢిల్లీలో ఉగ్రదాడులకు ఇరాన్ నిఘా విభాగం ఖడ్స్ ఫోర్స్ అధిపతి జనరల్ ఖాసీం సులేమనీ కుట్ర పన్నాడని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఇక్కడ ఆరోపించారు. ‘లక్షలాది మంది ప్రజలపై జరిగిన దాడుల్లో ముఖ్య పాత్ర పోషించాడు. ఇరాక్ లో అమెరికా పౌరులపై జరిపిన దాడుల్లోనూ ఆయన పాత్ర ఉంది. న్యూఢిల్లీ, లండన్ లలో ఉగ్ర దాడులకు ఆయన కుట్రలు పన్నాదు. ఆయన చేయదలచిన దాడులను అడ్డు కునేందుకే మేము అతడిని హత మార్చాం. మా దేశ దౌత్యాధికారులు, సైనికులే లక్ష్యంగా సులేమనీ దాడులకు సిద్ధమవుతున్నట్లు గుర్తించాం. అందుకే అతడిని హతమార్చాల్సి వచ్చింది. బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యా లయ ముట్టడితో పాటు ఇరాక్లోని తమ దేశ మిత్రపక్షాల సైనిక స్థావరాలపై దాడులకు అతడే సూత్రధారి. మా దౌత్యా ధికారులు, సైనికులపై చేయ బోయే మరిన్ని దాడులను అడ్డుకోవాలన్నదే మా ఉద్దేశం. యుద్ధాన్ని ఆపడం కోసమే తాము ఈ చర్య తీసుకున్నాం. అంతేగానీ యుద్ధాన్ని ప్రారంభించడం కోసం కాదు. ఇరాన్ ప్రజల పట్ల తమకు అమితమైన గౌరవం ఉంది. గొప్ప చరిత్ర, అత్యంత సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఇరాన్ ప్రజలు. ఇరాన్లో సామరస్యం కోరుకునే ప్రజల చేతుల్లోనే ఆ దేశ భవిష్యత్తు ఉంది. ఇరాన్ ఎన్నడూ యుద్ధాల్లో గెలవ లేదు. అయితే చర్చల్లో మాత్రం ఎప్పుడూ ఓడిపోలేద’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos