ఆంధ్రాకు ఐఎఎస్ శ్రీలక్ష్మి

ఆంధ్రాకు ఐఎఎస్ శ్రీలక్ష్మి

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌కు డిప్యుటేషన్‌పై వెళ్లడానికి ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన ఓబుళాపురం గనుల వ్యవహారంలో ఆమెపై సీబీఐ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఆమె జైలుకు కూడా వెళ్లొచ్చారు. రాష్ట్ర విభజనలో భాగంగా ఆమెకు తెలంగాణ కేడర్‌కు కేటాయించారు. వైకాపా అధినేత జగన్‌ 30న సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రాకు డిప్యుటేషన్‌పై వెళ్లడానికి ఆమె దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. ఆమె అభ్యర్థన పట్ల జగన్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించవచ్చని తెలుస్తోంది. కాగా హైదరాబాద్‌ రేంజ్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్రకు డిప్యుటేషన్‌ ఖరారైంది. ఆయనను ఆంధ్రా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. మరికొంతమంది అధికారులు కూడా ఆంధ్రాకు డిప్యుటేషన్‌పై వెళ్లడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos