ప్రజలకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోను..

ప్రజలకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోను..

నటుడు మోహన్‌బాబు స్థాపించిన శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల విద్యార్థుల ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ వివాదం అటుతిరిగి ఇటు తిరిగి చివరకు రాజకీయ మలుపు తీసుకున్న విషయం తెలిసిందే. మోహన్‌బాబుతో పాటు మోహన్‌బాబు కొడుకులు మంచు విష్ణు,మంచు మనోజ్‌లు కూడా తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు.తెదేపా స్పోక్‌ పర్సన్‌ కుటుంబరావు మోహన్‌బాబుపై, శ్రీవిద్యానికేతన్‌ సంస్థలపై కూడా విమర్శలు చేయడంతో ఆవేశానికి గురైన మంచు మనోజ్‌ తెదేపాపై,కుటుంబరావుపై కొంచెం గట్టిగానే ఎదురుదాడికి దిగాడు.ఈ పరిణామాలతో మంచు కుటుంబ తెదేపాకు వ్యతిరేకమని వార్తలు వినిపించడంతో మంచు మనోజ్‌ తాజాగా ట్విట్టర్‌లో వివరణ ఇచ్చుకున్నాడు.‘అందరికి ఒక మాట చెప్పాలనకుంటున్నా.నేను ఎప్పుడూ పార్టీలకు అతీతంగా ప్రజల కోసం నిలబడాలనుకునే మనిషిని.మనిషికి సహాయం చేసేపటపుడు కష్టం తప్ప కులం,మతం చూడకూడాదని నమ్మే వ్యక్తిని నేను.ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ కోసం చేసిన దీక్షకు మద్దతుగా నిలబడింది కూడా పిల్లల భవిష్యత్తు కోసమే కానీ రాజకీయ ప్రయోజనాల కోసం కాదు.మా కాలేజీలపై చేసిన తప్పుడు ఆరోపణల వల్లే తెదేపా పార్టీ మనిషిపై కఠినంగా స్పందించా’నన్నారు.దీంతోపాటు ఈ మంచు మనోజ్‌ పార్టీలకు అతీతంగా ప్రజాసేవకు ముందు ఉంటాడని పది మందికి మంచి చేసే ఏ కార్యక్రమానికైనా మద్దతుగా ఉంటాడని ప్రజలకు అన్యాయం చేసే ఏ పార్టీనైనా నిలదీస్తాడని ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోడని సవినయంగా తెలియజేస్తున్నాడని ట్వీట్‌ చేశాడు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos