వాన నీటి సంరక్షణ కోసం హొసూరులో మారథాన్

వాన నీటి సంరక్షణ కోసం హొసూరులో మారథాన్

హొసూరు : సకాలంలో వర్షాలు లేకపోవడంతో తాగు నీటికి నానా కష్టాలు ఎదురవుతున్నాయి. కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రతి నీటి బొట్టూ విలువైనదే. వర్షాలు పడినప్పుడు నీరంతా వృథాగా కాలువల పాలవుతూ ఉంటుంది. నీటి విలువను ప్రజలకు తెలియజెప్పడానికి, వర్షపు నీటిని సంరక్షించడానికి ప్రజల్లో జాగృతిని కల్పించే చర్యల్లో భాగంగా హొసూరులో విజయ్ విద్యాశ్రమ పాఠశాల విద్యార్థులు మారథాన్‌ను నిర్వహించారు. సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొని, వర్షపు నీటి ఆదా గురించి తెలియజెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos