నిఖిల్ ప్రేమిస్తుంది ఎవరినో తెలుసా?

  • In Film
  • October 13, 2019
  • 150 Views
నిఖిల్ ప్రేమిస్తుంది ఎవరినో తెలుసా?

కొద్ది రోజుల క్రితం టాక్ షో ఫీట్ అప్ విత్ స్టార్స్ కార్యక్రమంలో మంచు లక్ష్మీ ప్రముఖ హీరోహీరోయిన్లతో చిత్రాలతో పాటు వ్యక్తిగత జీవితంలోని పలు విషయాలను సైతం ప్రేక్షకుల ముందు బయటపెట్టేలా చేస్తూ షోను రక్తికట్టిస్తోంది.కొద్ది రోజుల క్రితం శృతి హాసన్‌తో తన తాగుడు అలవాటు గురించి గుట్టు విప్పేలా చేసిన మంచు లక్ష్మీ తాజాగా టాలీవుడ్ యువ హీరో నిఖిల్ వ్యక్తిగత విషయాలను బయటపెట్టించింది.నిఖిల్ మాట్లాడుతూ… నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి ఓ డాక్టర్. ఆమె చాలా కేరంగ్, అర్దం చేసుకునే మనస్తత్వం. ఆమె నేను షూటింగ్ లో ఉన్నప్పుడు కానీ, నా స్నేహితులతో బయిటకు వెళ్లినప్పుడు కానీ డిస్ట్రబ్ చెయ్యదు. నా ఫోన్ చెక్ చేయదు. ప్రతీ ఒక్కరికి తమ పర్శనల్ స్పేస్ ఉండాలని కోరుకుంటుంది. అది నాకు బాగా ఇష్టం అని చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కే అవకాసం ఉందని తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos