రాహుల్‌ గాంధీ హెలికాఫ్టర్‌ను తనిఖీ చేసిన అధికారులు

రాహుల్‌ గాంధీ హెలికాఫ్టర్‌ను తనిఖీ చేసిన అధికారులు

చెన్నై: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి చెందిన హెలికాఫ్టర్ను ఎన్నికల సంఘం అధికారులు నీలగిరి జిల్లాలో క్షుణ్ణంగా పరిశీలించారు. రాహుల్ గాంధీ సోమవారం ఉదయం తమిళనాడు నీలగిరి జిల్లా నుంచి తన సొంత నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్కు వెళ్తున్నారు. ఆయన్ని తీసుకెళ్లేందుకు హెలికాఫ్టర్ వచ్చింది. దీంతో ఎన్నికల ప్లయింగ్ స్వ్కాడ్ అధికారులు అక్కడికి చేరుకొని హెలికాఫ్టర్ను తనిఖీ చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. లోక్సభ ఎన్నికల కారణంగా అధికారులు పలు వాహనాలను తనిఖీ చేస్తున్న విషయం తెలిసిందే. ఓటర్లకు పంచిపెట్టేందుకు డబ్బు, మద్యం, గిఫ్ట్లు వంటివి తీసుకెళ్తారన్న అనుమానంతో ప్రజా రవాణాతోపాటు అధికారుల వాహనాలను కూడా ఫ్లయింగ్ స్వ్కాడ్ తనిఖీలు చేస్తుంటుంది. ఇందులో భాగంగానే ఇవాళ రాహుల్ గాంధీ హెలికాఫ్టర్ను అధికారులు తనిఖీ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos