అకస్మాత్తుగా కోటీశ్వరులైన హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ఖాతాదారులు

అకస్మాత్తుగా కోటీశ్వరులైన హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ఖాతాదారులు

చెన్నై : బ్యాంకు ఖాతాలో రూ.లక్షలు, కోట్లు జమ అయితే ఎగిరి గంతేయడం ఖాయం. చెన్నైలో హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు ఖాతాదారులూ ఇదే పని చేశారు. ఆదివారం టీ నగర్ హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు శాఖ పరిధిలో 100కు పైగా ఖాతాల్లో గరిష్ఠంగా రూ.13 కోట్ల చొప్పున జమ అయింది. ఎంత మొత్తం అన్నది హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు నిర్ధారించ లేదు. వేల రూపాయల నుంచి రూ.13 కోట్ల వరకు ఖాతాల్లో జమ అయినట్టు తెలిపింది.. సాంకేతిక సమస్య దీనికి కారణం. ఆదివారం సెలవు దినం కావడంతో వేకువ జాము సమయంలో సాఫ్ట్ వేర్ ప్యాచ్ ను అమలు చేసినపుడు ఈ తప్పిదం చోటు చేసుకుందని బ్యాంకు తెలిపింది. అయితే ఇలా జమ అయిన తర్వాత ఎవరైనా ఉపసంహ రించు కున్నారా? అన్న విషయమై బ్యాంకు దర్యాప్తు నిర్వహిస్తోంది. ఖాతాలన్నింటినీ తనిఖీ చేసి, అదనపు జమలను బ్యాంకు సాయంత్రానికి వెనక్కి తీసేసుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos