లంకకు కొత్త అధ్యక్షుడు..

లంకకు కొత్త అధ్యక్షుడు..

శ్రీలంక అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో గోటబయ రాజపక్సే విజయం సాధించారు. ఆదివారం ఉదయం 11 గంటల వరకూ లెక్కించిన ఐదు లక్షల ఓట్లలో రాజపక్స 52.87 శాతం ఓట్లు పొలవగా, సమీప ప్రత్యర్థి మంత్రి సజిత్ ప్రేమదాసకు 39.67 శాతం ఓట్లు పోలయ్యాయి. మరో లెఫ్ట్ అభ్యర్థి అనుర కుమార దిస్సానాయకేకు 4.69 శాతం ఓట్లు పోలయినట్టు శ్రీలంక ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ లో ప్రకటించింది.శ్రీలంక పోడుజన పెరమున (ఎస్ఎల్పీపీ) అభ్యర్థిగా ఎన్నికల్లోకి దిగిన 70 ఏళ్ల రాజపక్సే మాజీ అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సే సోదరుడు.విదేశీ పౌరసత్వం ఉన్నవారిని శ్రీలంకయేతరులను ఎన్నికలలో పోటీ చేయడానికి అక్కడి శ్రీలంక చట్టాలు అనుమతించవు.దీంతో శ్రీలంక అధ్యక్ష ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆయన తన అమెరికా పౌరసత్వాన్ని వదలుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos