పాతాళానికి ప్రగతి

పాతాళానికి ప్రగతి

న్యూ ఢిల్లీ: కరోనా కారణంగా 2020లో దేశ స్థూలోత్పత్తి రేటు 2.5 శాతానికి పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని రేటింగ్ సంస్థ మూడీస్ అంచనా వేసింది. వచ్చే రెండు, మూడు త్రైమాసికాలు భారతదేశంలో అన్ని రంగాలు కరోనా వల్ల తీవ్రంగా ప్రభావం చెందనుంది. జీడీపీ వృద్ధి రేటు మరింత కనిష్టానికి పడిపోనుందని మదింపు వేసింది. 8 శాతం పైగా వృద్ధి రేటుతో దూసుకుపోయిన భారత జీడీపీ 2019 లో 5 శాతానికి దిగింది. ఇపుడు 5 శాతాన్ని చేరుకోవటమూ కష్టంగా మారిపోయింది. లాక్డౌన కారణంగా ప్రస్తుత త్రైమాసికంలో జీడీపీ వృద్ధి కేవలం ఒక శాతానికి పడిపోతుందని ఐఎన్జీ గ్రూప్, డాయిష్ బ్యాంకు సహా పలువురు ఆర్థికవేత్తలు భావించారు. ఏప్రిల్-జూన్ నెలల్లో నిజమైన జీడీపీ వృద్ధి కుప్పకూలనుంది. చైనా అనుభవం ప్రకారం వార్షిక ప్రాతిపదికన ఐదు శాతం లేదా అంతకంటే దిగువకు పతనమవుతుందని డాయిష్ బ్యాంక్ చీఫ్, ఇండియా ఎకనామిస్ట్ కౌశిక్ దాస్ అంచనా వేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos