విదూషకుడిలా వ్యవహరించొద్దు

విదూషకుడిలా వ్యవహరించొద్దు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ మన దేశాన్నీ ప్రభావితం చేస్తున్న దశలో ప్రధాని మోదీ వైఖరిని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం ట్విట్టర్లో తప్పు బట్టారు.’భారత్ ఓ అత్యవసర స్థితి ముంగిట నిలిచిన తరుణంలో సామాజిక మాధ్యమాల ఖాతాలతో విదూషకుడిలా వ్యవ హరిస్తూ దేశ ప్రజల సమయాన్ని వృథా చెయ్యడం మానేయండ’ని సలహా ఇచ్చారు. కరోనా ముప్పును ఎదుర్కొనేందుకు ప్రతి భారతీయుడ్ని సన్నద్ధం చేయడంపై దృష్టి నిలపండి అంటూ హితవు పలికారు. కరోనా పట్ల సింగపూర్ ప్రధాని తమ ప్రజలను ఎలా అప్రమత్తం చేస్తున్నాడో చూడండి అని ఒక వీడియోను జతపరిచారు. ‘ప్రతి దేశాధినేతకు పరిస్థితులు కొన్నిసార్లు పరీక్ష పెడతాయి. నిజమైన నేత సమస్యను ఎదుర్కోవ డంపైనే పూర్తిస్థాయిలో దృష్టిపెడతాడ’ని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos