బొప్పాయిలో ఆరోగ్య రహస్యాలు

బొప్పాయిలో ఆరోగ్య రహస్యాలు

పల్లెటూళ్లలో దాదాపు ప్రతి ఇంట్లో బొప్పాయి చెట్లు ఉంటాయి. వీటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంగ్లిష్‌లో ‘ఫ్రూట్ ఆఫ్ ఏంజెల్స్’గా పిలిచే బొప్పాయిలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బొప్పాయిలో కేరోటిన్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి, విటమిన్ కె అధిక మోతాదులో ఉంటాయి. పీచు పదార్థం, మెగ్నీషియం కూడా విరివిగా లభిస్తాయి. బొప్పాయి వల్ల లభించే ప్రయోజనాలేంటో చూద్దాం.. 

జీర్ణక్రియ మెరుగవుతుంది:
జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారికి బొప్పాయి తినడం ప్రయోజనకరం. వీటిలో అల్సర్లను తగ్గించే గుణాలుంటాయి. ఇందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. మలబద్దకాన్ని బొప్పాయి నివారిస్తుంది. 

బరువు తగ్గడం:
బరువు తగ్గాలనుకుంటున్న వారికి బొప్పాయి మంచి ఆహారం. ఇందులో పీచుపదార్థాలు అధికంగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. బొప్పాయి ఆకలిని నియంత్రిస్తుంది. ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. కాబట్టి త్వరగా బరువు తగ్గుతారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos