పోలీసులపై ప్రశంసల జడివాన..

పోలీసులపై ప్రశంసల జడివాన..

దిశ హత్యాచార ఘటనలో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసి హతమార్చిన తెలంగాణ పోలీసులపై సర్వత్రా ప్రశంసలు జడివాన కురుస్తోంది.సాధారణ ప్రజల నుంచి రాజకీయ,సినీ,క్రీడా తదితర అన్ని రంగాల ప్రముఖులు పోలీసులపై హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా కమిషనర్‌ సజ్జనార్‌పై ఒక రేంజులో ప్రశంసలు కురిపిస్తున్నారు. శను దారుణంగా హతమార్చిన వారిని ఎన్ కౌంటర్ చేసి చంపడాన్ని హర్షిస్తున్న ప్రజలు, పోలీసుల చర్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశానికి పెద్దఎత్తున చేరుకున్న ప్రజలు, పోలీసులకు జయజయధ్వానాలు పలుకుతూ, పూలవర్షం కురిపించారు. బస్తాల్లో పూలు తెచ్చి, పోలీసులపై చల్లుతూ, తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పోలీసులకు స్వీట్స్ తినిపించారు. ఎన్ కౌంటర్‌తో పోలీసులంటే నమ్మకం పెరిగిందని పలువురు వ్యాఖ్యానించారు. దిశకు న్యాయం జరిగిందని అంటున్నారు.ఎన్ కౌంటర్ లో నిందితులు మరణించడంపై ఎవరూ బాధపడటం లేదని, ఇంత దారుణానికి ఒడిగట్టిన వారికి తగిన శిక్షే పడిందన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరికొందరు ఘటనా స్థలి వద్ద జాతీయ రహదారిపై టపాసులు కాల్చారు. పోలీసులపై పూల వర్షం కురిపిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో ట్విట్టర్ తోపాటు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఇదే అంశం టాప్ లో నిలుస్తోంది. నెటిజన్లు ప్రస్తుతం ఇందుకు సంబంధించి అంశాలనే సెర్చి చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్ కౌంటర్, హైదరాబాద్ పోలీస్, దిశా కేస్, జస్టిస్ ఫర్ దిశ, తెలంగాణ పోలీస్, హ్యూమన్ రైట్స్, హైదరాబాద్ హర్రర్, బిగ్ బ్రేకింగ్, రిప్ దిశ హ్యాష్ ట్యాగులు ట్విట్టర్ లో టాప్ లో నిలుస్తున్నాయి. ట్విట్టర్ లోని టాప్ ఫైవ్ ట్రెండింగ్ లో హైదరాబాద్ పోలీస్ ఉండడం విశేషం. టాప్ ఫైవ్ లో ఉన్న మిగిలిన హ్యాష్ ట్యాగులు కూడా దిశ హత్యోదంతానికి సంబంధించినవే కావడం విశేషం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos