రోడ్డుపై ఎదురుపడ్డ శత్రువులు..

రోడ్డుపై ఎదురుపడ్డ శత్రువులు..

ముంగిస.. పాము ఎదురుపడితే ఆ పోరు భయంకరంగా వుంటుంది. నువ్వా నేనా అంటూ పాము, ముంగిస పోటీ పడతాయి. అలాంటి ఆ రెండు రోడ్డుపై ఎదురుపడ్డాయి. ఇంకా వాటి మధ్య భీకర పోరు జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి డాక్టర్ అబ్దుల్ ఖయూమ్ షేర్ చేశారు.ప్రజలు రోడ్డు పక్కన నిలబడి మొత్తం సంఘటనను చూసేటప్పుడు ముంగిస, పాము.. రోడ్డు మధ్యలో ఒకదానితో ఒకటి పోరాడుతున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది.ఈ పోరాటంలో పాము కాలువ లోపల దాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. కాని ముంగిస దానిని చంపి నోటిలో పట్టుకొని పారిపోతుంది. ఈ వీడియోను 6.4కే నెటిజన్లు వీక్షించారు. ఇంకా ఈ వీడియోపై విభిన్నాభిప్రాయాలు వెల్లడిస్తున్న నెటిజన్ల సంఖ్య పెరిగిపోతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos