ఆజాద్ హింసను ప్రేరేపించారనేందుకు ఆధారాలేవి?

ఆజాద్ హింసను ప్రేరేపించారనేందుకు ఆధారాలేవి?

న్యూఢిల్లీ : నిరసన తెలపడం పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు, పార్లమెంట్లో చెప్పాల్సిన విషయాలు చెప్పనందుకే ప్రజలు వీధుల్లోకి వచ్చారని ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి మంగళ వారం వ్యాఖ్యానించారు. నూతన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జామా మసీద్లో నిరసించిన భీమ్ ఆర్మీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ బెయిల్ పిటిషన్ విచారణలో ఈ మేరకు స్పందించార. ‘జామా మసీద్ పాకిస్తాన్లో ఉన్నట్టు మీరు ప్రవర్తిస్తున్నార’ని ఢిల్లీ పోలీసుల తీరును తప్పు పట్టింది. జామా మసీద్ వద్ద ధర్నా చేస్తునట్లు సామజిక మాధ్యమాల్లో ఆజాద్ పోస్ట్ చేశారని ప్రాసిక్యూటర్ చెప్పినపుడు వాటిలో తప్పేముంది? హింస ఎక్కడ చెలరే గిందని..మీరసలు రాజ్యాంగాన్ని చదివారాని’ అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. సెక్షన్ 144 అమల్లో ఉన్నందున ముందస్తు అనుమతి అవసరమని ప్రాసిక్యూటర్ వాదించినపుడు పదే పదే సెక్షన్ 144 విధించడం వేధింపుల కిందకు వస్తుం దని సర్వోన్నత న్యాయ స్ధానం తేల్చి చెప్పిందని గుర్తు చేసారు. ఆజాద్ హింసను ప్రేరేపించా రనేందుకు ఆధారాలు చూపాలని ఆదే శిం చారు. ఇందుకు తమకు తగినంత సమయం ఇవ్వాలని ప్రాసిక్యూటర్ కోరటంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది.

తాజా సమాచారం