వికాస్‌దూబేకు విదేశాల్లో ఆస్తులు

వికాస్‌దూబేకు విదేశాల్లో ఆస్తులు

కాన్పూర్ : హతుడు, గూండా వికాస్ దూబేకు విదేశాల్లో ఆస్తులున్నా, అతనికి మాత్రం పాస్ పోర్టు మాత్రం లేదని అధికారులు తేల్చారు. వికాస్ దూబే పేరిట అతని గ్రామం చిరునామాతో పాస్ పోర్టు లేదని వెల్లడైంది. వికాస్ దూబేకు దుబాయ్, థాయ్ లాండ్ దేశాల్లో ఆస్తులున్నాయని, స్థానిక వ్యాపారి జై బాజ్ పాయ్ ద్వారా నల్లధనాన్ని విదేశాలకు తరలించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. వికాస్ దూబే కుమారుడు విదేశాల్లో వైద్యవిద్య అభ్యసిస్తున్నాడు. అయితే వికాస్ దూబేకు మాత్రం పాస్ పోర్టు లేదని పాస్ పోర్టు అధికారులు స్పష్టం చేశారు. లక్నో నగరంలోని కృష్ణనగర్ లో వికాస్ దూబేకు చెందిన ఇంటిని లక్నో డెవలప్ మెంటు అథారిటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు .పోలీసులు బిక్రూ గ్రామానికి వెళ్లినపుడు వారికి జేసీబీని అడ్డంగా నిలిపిన డ్రైవరునూ పోలీసులు అరెస్టు చేశారు.

తాజా సమాచారం