ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులు ధ్వంసం

ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులు ధ్వంసం

లండన్ : ‘ప్రధాని మోదీ దృష్టిలో దేశ ప్రజలు అందరూ ఉండరు. కొందరి ప్రయోజనాలను మాత్రమే పరిగణిస్తార’ని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం కార్పస్ క్రిస్టీ కాలేజ్లో ఏర్పాటు చేసిన ‘ఇండియా ఎట్ 75′ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘భారత్లో ప్రజాస్వామ్య వ్యవస్థను అణచివేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్లో సమస్యలను ఎత్తిచూసే సంస్థలను క్రమంగా అణచి వేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్లమెంట్, ఎన్నికల వ్యవస్థ సహా ప్రజాస్వామ్య వ్యవస్థను ఓ సంస్థ తన అధీనంలోకి తెచ్చుకుంది. స్వేచ్ఛగా ప్రశ్నించేందుకు అవకాశం ఉన్నప్పుడే భారత్ సజీవంగా ఉన్నట్లు. అదే మౌనంగా ఉంటే ఇంక అందులో అర్థం లేదు. పార్లమెంట్, ఎన్నికలు, ప్రజాస్వామ్యం మొదలైన వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ విజన్లో కేవలం కొంతమంది మాత్రమే ఉంటారు. ఈ వైఖరిని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. హిందూ జాతీయవాదం అనే పదాన్ని కూడా అంగీకరించను. దాడులు, హత్యలకు పాల్పడే వారి సిద్ధాంతాలను హిందుత్వంతో పోల్చడం సరికాదు.ప్రధాని, ఆర్ఎస్ఎస్లు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులను ధ్వంసం చేసేందుకు యత్నిస్తున్నారు. భారత్లో మీడియాను కూడా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే కొంతమంది వ్యాపారవేత్తలు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అందుకే నేను మాట్లాడింది భారత్లోని ఛానెళ్లలో 30 సెకన్లకు మించి ప్రసారం కాదు. ఇక్కడ పోరాటం కేవలం ఓ రాజకీయ పార్టీపైన కాదు.. ఆ వ్యవస్థ మీద. దీనిపై విజయం సాధించడం అంత సులభం కాదు. జీవితకాలం పట్టొచ్చు. అయినా మేము పోరాడుతాం’ అని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos