నకిలీ డెబిట్/క్రెడిట్ కార్డులతో వంచన

నకిలీ డెబిట్/క్రెడిట్ కార్డులతో వంచన

హైదరాబాదు: ఆ ముగ్గురూ చదువుకుంది పదో తరగతి లోపే అయినా వంచనా శిల్పంలో ఆరి దేరారు. ఆధునికసాంకేతికతపై పట్టు సాధించి గత మూడేళ్లుగా బ్యాంకు ఖాతాదారులను మోసం చేయటంలో సిద్ధహస్తులయ్యారు. చాలా పకడ్బంధీగా సాగిన వారి దగాకు చిట్ట చివరికి పోలీసులు కళ్లెమేసారు. నేరగాళ్లు ప్రపుల్ కుమార్ నాయక్ (25), హేమంత కుమార్ నాయక్ (28), సుజిత్ కుమార్ నాయక్ (31) స్వస్థలం ఒడిశా రాష్ట్రం, గంజాం జిల్లా మోహాసాయి పెంతో గ్రామం. జీవిక కోసం గత పదేళ్లుగా హైదరాబాద్, చెన్నై నగరా ఉన్నారు. అక్కడ డెబిట్/క్రెడిట్ కార్డుల వివరాలతో నకిలీ కార్డులు తయారీపై శిక్షణ పొందారు. క్లోనింగ్ యంత్రాలు సమకూర్చుకున్నాక 2017 నుంచి బ్యాంకు ఖాతాదార్లను కొల్ల గొట్టడం ఆరంభించారు. ఇందుకు చాలా పకడ్బందీ అయిన వ్యూహాన్ని అమలు చేసారు. హేమంత్ కుమార్ నాయక్ ఖరీదైన రెస్టారెంట్లు, పబ్బుల్లో వారం, పది రోజుల పాటు బేరర్గా పని చేసే వాడు. అప్పుడు వినియోగదార్లు బిల్లు చెల్లించేటపుడు ఇచ్చిన కార్డు, పిన్ నంబర్ తదితర వివరాలను ప్రపుల్ కుమార్ నాయక్‌ కు చేరవేసేవాడు. వీటి ఆధారంగా అతడు క్లోనింగ్ చేసి నకిలీ కార్డు తయారు చేసేవాడు. వాటితో సుజిత్ కుమార్ ఏటీఎంల నుంచి డబ్బు విత్ డ్రా చేసేవాడు. హైదరాబాదు, యూసుఫ్ గూడ జూబ్లీహిల్స్ ఏటీఎం నుంచి రూ.76 వేలు విత్ డ్రా అయినట్లు గచ్చిబౌలి హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు మేనేజర్ ఈ నెల 5న సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మొత్తం డొంకంతా కదిలించి ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos