కోటి మంది స్వాగతిస్తారట

కోటి మంది స్వాగతిస్తారట

కొలరాడో:భారత పర్యటనలో తనకు కోటిమందితో స్వాగతం పలకబోతున్నారని ప్రధాని మోదీయే తనకు చెప్పారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.70 లక్షల మందితో మోదీ తనకు స్వాగతం పలకబోతున్నారని ఇటీవల చెప్పిన ట్రంప్. ఇప్పుడా సంఖ్యను ఏకంగా కోటికి పెంచేశారు.ఇక్కడి జాయింట్ బేస్ ఆండ్రూస్లో ట్రంప్ విలేకరులతో మాట్లాడినపుడు అహ్మదాబాద్లో తనకు 70 లక్షల మంది స్వాగతం పలకబోతున్నారని చెప్పారు. కొలరాడో సభలో ఆయన శుక్రవారం మాట్లాడినపుడు మొతేరా స్టేడియానికి వెళ్లే 22 కి.మీ దారి పొడవునా కోటిమంది తనకు స్వాగతం పలకబోతున్నారని చెప్పారు. అంతేకాదు, కోటి మంది హాజరయ్యే కార్యక్రమం చూసిన తర్వాత 60 వేల మంది హాజరయ్యే సభలు తనకు సంతృప్తి ఇవ్వలేవని, ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం ఒకరకంగా తనను చెడ గొడుతుందని పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటనలపై నెటిజన్లు అవాక్క య్యారు. ప్రపంచంలో ఎక్కడా కోటిమంది హాజరైన సందర్భాలు లేవని గుర్తు చేసారు. మోదీ-ట్రంప్ రహదారి ప్రదర్శనకు రెండు లక్షల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని అహ్మదాబాద్ మునిసిపల్ కమిషనర్ పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos