అది ఏక పక్ష నిర్ణయం

అది ఏక పక్ష నిర్ణయం

కడప: జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370 అధీకరణను కేంద్ర రద్దు చేయటం ప్రజా వ్యతిరేక నిర్ణయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామ కృష్ణ వ్యాఖ్యానించారు. సోమవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. జమ్మూ-కశ్మీర్పై భాజపా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసు కుందని ఆరోపించారు. ఇది దేశ ప్రజలలో ఉద్రిక్తత, అభద్రతా భావం నెలకొనే అవకాశం ఉందన్నారు. కశ్మీర్ నాయకులను నిర్భందంతో ఉంచి దేశ విభ జన సమయంలో పెద్ద మనుషులు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయడం సరికాదన్నారు. హత్య కేసుల్ని ఎదిరిస్తున్న అమిత్ షా లాంటి వ్యక్తిని హోం మంత్రి గా నియ మిస్తే ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటారని విమర్శించారు. ఇప్పటికైనా భాజపా ప్రభుత్వం ప్రజాభిప్రాయం ప్రకారం నిర్ణయాలు తీసుకో వాలని డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos