హొసూరులో ప్రైవేట్ కంపెనీకి సీల్

హొసూరులో ప్రైవేట్ కంపెనీకి సీల్

హొసూరు : లాక్ డౌన్ అమలులో ఉన్నా హొసూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని తెలిసి ఆ కంపెనీని అధికారులు సీల్ చేశారు. హొసూరు-రాయకోట రోడ్డులో గల ఓ ప్రైవేట్ కంపెనీలో ద్విచక్ర వాహనాలకు చెందిన విడి భాగాలు తయారు చేస్తున్నారు. ఈ కంపెనీలో 50 మందికి పైగా కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. కరోనా ప్రభావంతో లాక్ డౌన్ అమలు చేయడంతో హోసూరు పారిశ్రామిక ప్రాంతంలో అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. అందులో భాగంగా అధికారుల ఆదేశాలను ధిక్కరించి రాయ కోట రోడ్డు లోని ఓ ప్రైవేటు కంపెనీ యజమాని మంజునాథ్ తన కంపెనీ బయట తాళం వేసి లోపల 50 మంది కార్మికులతో పనులు చేయిస్తున్నట్లు స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. అందులో భాగంగా తహసిల్దార్, పోలీసులు ఆకస్మికంగా కంపెనీలో తనిఖీలు నిర్వహించారు. అధికారుల తనిఖీల్లో కంపెనీ లోపలిభాగంలో కార్మికులు పని చేస్తుండగా చూసిన అధికారులు కార్మికులను బయటకు పంపించి కంపెనీకి సీల్ వేశారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి రహస్యంగా కంపెనీలో పనులు చేయిస్తున్న కంపెనీ యజమానిపై కేసు నమోదు చేయనున్నట్లు అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos