చిరంజీవికి గాలం వేస్తున్న బీజేపీ!

చిరంజీవికి గాలం వేస్తున్న బీజేపీ!

ఉత్తరాదిలో ఎంతగా బలపడుతున్నా దక్షిణాదిలో మాత్రం అనుకున్నంత స్థాయిలో బలోపేతం కాకపోతుండడంతో బీజేపీ అధిష్టానం దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి సారించింది.కర్ణాటకలో బీజేపీ బలంగానే ఉన్నా కేరళ,తమిళనాడు,రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ పాచికలు పారడం లేదు.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కనీస గుర్తింపు,ప్రాధాన్యత కూడా దక్కడం లేదు.ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలోపేతం కాలేకపోతుండడంతో కొరకరాని కొయ్యగా పరిణమించిన ఆంధ్రప్రదేశ్‌పై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది.ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆపరేషన్‌ కమలను ప్రారంభించిన బీజేపీ నలుగురు తెదేపా రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్చుకొని ఆంధ్రప్రదేశ్‌లో బలోపేత చర్యలకు శ్రీకారం చుట్టింది.వీరితో పాటు తెదేపా,కాంగ్రెస్‌లోని కీలక నేతలు,సీనియర్‌ నేతలను కూడా బీజేపీలో చేర్చుకోవడానికి బీజేపీ ప్లాన్‌ను రెడీ చేస్తోంది.ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీలో చేరగా రాయలసీమకు చెందిన పెద్ద కుటుంబాలని సైతం పార్టీ మార్చటానికి తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే బిజెపి నేతలు వారితో చర్చలు కూడా జరుపుతున్నారు.ఇక ప్రజారాజ్యం పార్టీ స్థాపించి దాన్ని నడపలేక కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్రమంత్రిగా పనిచేసి చివరకు రాజకీయాల నుంచి దూరం జరిగిన  మెగాస్టార్ చిరంజీవిని పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.చిరంజీవితో సోమవారం రాత్రి బిజెపి కాపు సామాజిక వర్గ నేతలు భేటి అయినట్టు విశ్వసనీయత సమాచారం. ప్ర‌స్తుతం కాంగ్రెస్‌లో పార్టీలో ఉన్నా సరే ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ కి ప్రచారం చేయలేదు.ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 74 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నేపధ్యంలో చిరంజీవిని పార్టీలోకి తీసుకుని ఆయన అంగీకరిస్తే ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్ష పదవి ఇవ్వాలని కూడా బిజెపి భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాంమాధవ్, కన్నా లక్ష్మీ నారాయణ సహా కొందరు చిరంజీవితో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos