అంగుళం భూ భాగాన్ని వదలుకోం

అంగుళం భూ భాగాన్ని వదలుకోం

బీజింగ్: చైనా ప్రభుత్వ అభిప్రాయాల ప్రచురణకు పెద్ద పీట వేసే ఒక ప్రతిక పొరుగు దేశాలతో చైనా స్నేహాన్ని మాత్రమే కోరుకుంటుదని తెలిపింది. తమ భూభాగాన్ని భారత్కు వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అమెరికాతో దౌత్యసంబంధం నెరపే విషయంలో భారత్ అప్రమత్తంగా ఉండాలనీ హెచ్చరించింది. అమెరికా చేతుల్లో మోస పోవద్దని సలహా ఇచ్చింది. ‘భారత్తో విభేదాలు చైనాకు నచ్చవు. పొరుగు దేశాలతో సఖ్యత అనేది చైనా విదేశాంగ విధానంలో ఓ మౌలిక అంశం. ఎటువంటి సరిహద్దు వివాదాలనైనా శాంతి యుతంగా పరిష్కరించు కోవాలనే విధానానికి చైనా కట్టుబడి ఉంది. భారత్ను శత్రువుగా చూసేందుకు ఏ కారణమూ చైనాకు లేదు. పరిస్థితులు దిగజారితే భారత్ ఉపఖండంలో అస్థిరత నెలకొంటుంది. ఒక అంగుళం భూ భాగాన్ని కోల్పోయేందుకు కూడా చైనా సిద్ధంగా లేదు. బయటి శక్తులేవీ దీన్ని నివారించలేవు. అమెరికా చేతిలో భారత్ మోసపోకూడదు. దేశాల మధ్య ఎడం పెంచుతూ వాటిని తనవైపు తిప్పుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోంద’ని వ్యాఖ్యానించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos