కేంద్ర ప్రభుత్వానికి భారీ నిధులిచ్చిన ఆర్బీఐ

కేంద్ర ప్రభుత్వానికి భారీ నిధులిచ్చిన ఆర్బీఐ

ముంబై : భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) శుక్రవారం రూ.99,122 కోట్లు కేంద్రానికి బదిలీకి ఆమోదించింది. బ్యాంకు డైరెక్టర్ల వీడియో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ఆర్బీఐ బోర్డు సమీక్షించింది. బ్యాంకు అకౌంటింగ్ ఇయర్ జూలై-జూన్ నుంచి ఏప్రిల్-మార్చికి మారింది. దరిమిలా 2020 జూలై నుంచి 2021 మార్చి వరకు గల తొమ్మిది నెలల బ్యాంకు కాలానికి వార్షిక నివేదికను, ఖాతాలను ఆమోదించింది. తొమ్మిది నెలల మిగులు రూ.99,122 కోట్లును కేంద్రానికి బదిలీ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. 5.5 శాతం కంటింజెన్సీ రిస్క్ బఫర్ను నిర్వహించాలని నిర్ణయించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos