రాజకీయ దురుద్దేశంతో తప్పుడు కేసు

ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తొలిసారి పెదవి విప్పారు. ‘జైన్పై కేసును పూర్తిగా అధ్యయనం చేశాను. ఇది పూర్తిగా తప్పుడు కేసు. రాజకీయ కారణాలతో ఆపాదించిన కేసు. న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. సత్య మార్గా న్ని జైన్ అనుసరిస్తుంటాడు. ఆయన పూర్తిగా క్లీన్చిట్తో బయట పడతారు”అని ధీమా వ్యక్తం చేశారు. మనీ లాండరింగ్ యాక్ట్ లోని క్రిమినల్ సెక్షన్ల కింద జైన్ను ఈడీ సోమ వారం కొన్ని గంటల సేపు ప్రశ్నించి, అనంతరం బంధించింది. సత్యేంద్ర జైన్ అరెస్టును బీజేపీ, కాంగ్రెస్ స్వాగతించాయి. మంత్రి వర్గం నుంచి జైన్ను కేజ్రీవాల్ తొలగిం చాలని డిమాండ్ చేశాయి. గత జనవరిలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ సైతం జైన్ను ఈడీ అరెస్టు చేయవచ్చనే సమాచారం తనకు తెలిసిందని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos