రైతులు రోడ్డున పడటానికి కారణం చంద్రబాబే

రైతులు రోడ్డున పడటానికి కారణం చంద్రబాబే

విజయవాడ : రైతులు వీధిన పడటానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు విమర్శించారు. నవంబర్ 7 నుంచి 15 వరకు రాష్ట వ్యాప్తంగా సీపీఎం పార్టీ చేపట్టనునున్న రాజకీయ ప్రచారాన్ని శనివారం ఇక్కడ లాంఛనంగా ఆరంభించారు. ‘రాష్ట్రం బాగు కోరుకునే వారు బీజేపీని వ్యతిరేకించాలి. రాజధానికి 55 వేల ఎకరాలు అవసరం లేదని నాడే చెప్పాం. రాజధానికి 15 వేల ఎకరాలు చాలు. రాజధాని పేరుతో రియలేస్టేట్ వ్యాపారం చేశారు. బాబుకు ఎంత చెప్పినా వినలేదు. రైతులు రోడ్డున పడటానికి చంద్రబాబే కారణం. రాజధాని పూర్తి కాకపోవడానికి కారణంగా చంద్రబాబే’ అని విమర్శించారు. ఇంకా ‘ప్రపంచ దేశాలలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పోయింది. ప్రభుత్వాలు ప్రజలకొనుగోలు శక్తి పెంచాలి. అంబానీ, ఆదాని ఆస్తులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ రాయితీలు వారు దోచుకుంటున్నారు. బీజేపీ కరోనా కట్టడిలో విఫలమైంది. ఆర్థిక వ్యవస్థను కుంటు పరచింది. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా కొత్త చట్టాలు తెచ్చారు. బీజేపీ దేశం మొత్తన్ని అమ్మేస్తుంది. కంపెనీలు, రైళ్లను ప్రవేటు పరం చేస్తున్నారు. కార్మికులు మహిళల, రైతుల,దళితుల, మైనార్టీల హక్కులను బీజేపీ కాలరాసింది. విద్యా వ్యవస్థ నాశనం చేసింది. రాజధాని, పోలవరం డబ్బులు ఎగ్గొట్టాలని చూస్తుంది. రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్ట్, వెనుకబడి జిల్లాలకు బుందేల్ కండ్ తరహా ప్యాకేజీ అంశాలలో బీజేపీ చేతులు దులుపు కుంటుంది. బీజేపీ మత కలహాలు సృష్టిస్తోంది’అని దుయ్యబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos