రిషి ని మాత్రం ఎన్నుకోవద్దు

రిషి ని మాత్రం ఎన్నుకోవద్దు

లండన్: బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునక్ మినహా ఇతరులు ఎవ్వరైనా పదవిని అలంకరిం చాలని తాత్కాలిక ప్రధాని బోరిస్ జాన్సన్ తన మద్దతు దారులకు హితవు పలికారు. ‘రిషి నాకు ద్రోహం చేశాడు. ఆయన వల్లే సొంత పార్టీ నేతలూ దూరమయ్యారు. తదుపరి ప్రధానిగా ఎవరు ఉండాలన్న విషయంలో నేను తలదూర్చబోను. రిషి మాత్రం ప్రధాని కాకూడదు. విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్, జాకబ్ రీస్, డోరిస్, పెన్నీ మోర్డాంట్లలో ఎవరో ఒకరికి మద్దతునివ్వాల’ని ద టైమ్స్ కథనం. 10 డౌనింగ్ స్ట్రీట్ రిషిని వ్యక్తిగతంగా ద్వేషిస్తోందని, బోరిస్ను పదవి నుంచి తప్పించేందుకు కొన్ని నెలలుగా రిషి ప్రయత్నిస్తున్నట్టు డౌనింగ్ స్ట్రీట్ భావిస్తోందని ఆ కథనం వివరించింది. అయితే, ఇది తప్పుడు కథనమని, ఈ ప్రచారంలో వాస్తవం లేదని బోరిస్ సన్నిహితుడొకరు తెలిపారు. రిషిని ఓడించేందుకు జాన్సన్ ప్రయత్నిస్తు న్నారన్న ప్రచారంలో వాస్తవం లేదన్న ఆయన.. రిషి తనకు ద్రోహం చేశాడని మాత్రం బోరిస్ భావిస్తు న్నారని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos