రాహుల్ పాదయాత్రలో ఓ అద్భుత దృశ్యం..

రాహుల్ పాదయాత్రలో ఓ అద్భుత దృశ్యం..

మండ్య: లోకాన్ని ఏలే రాజైనా.. ఆఖరికి ఆ దేవుడైనా సరే ఓ అమ్మకు కొడుకే.. కొడుకు ఎంత పెద్దవాడైనా.. ఏ స్థాయిలో ఉన్నా.. అమ్మకు మాత్రం ముద్దుల తనయుడే. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసే ఓ అద్భుత ఘటన కాంగ్రెస్ నేత రాహుల్ పాదయాత్రలో గురువారం జరిగింది. రాహుల్తో కలిసి సోనియా నడిచారు. ఆ సమయంలో ఆమె వేసుకున్న షూ లేస్ ఊడిపోయింది. దీంతో పక్కనే ఉన్న రాహుల్ తల్లి షూ లేస్ ముడివేశారు. సోనియా నవ్వులు చిందిస్తూ తన కుమారుడిని చూశారు. తల్లీ కొడుకుల అనుబంధానికి నిదర్శనంగా నిలిచిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాంగ్రెస్ పార్టీకి యువరాజైనా.. సోనియాకు మాత్రం రాహుల్ కొడుకే నంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కర్ణాటకలో పాదయాత్ర చేసేందుకు రావడం తమకు గర్వకారణమని సోనియా అన్నారు. భారత్ జోడో యాత్ర 29వ రోజు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సుమారు 3,570 కి.మీ మేర ఈ సాగుతోంది. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా 148 రోజుల పాటు రాహుల్ నేతృత్వంలో నేతలు, కార్యకర్తలు పాదయాత్ర చేయాలన్నది ప్రణాళిక. భాజపా విచ్ఛిన్నకర రాజకీయాలపై పోరాడేందుకు; ఆర్థిక అసమానతలు, రాజకీయ శక్తి కేంద్రీకరణతో పొంచి ఉన్న ముప్పు పట్ల ప్రజల్ని చైతన్యపరిచేందుకు ఈ యాత్ర చేస్తున్నామని కాంగ్రెస్ ప్రకటించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos