హాంగ్జూ: ఆసియా క్రీడ ల్లో ఇండియాకు మరో గోల్డ్ మెడల్ దక్కింది. ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇవాళ జరిగిన పురుషుల ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల నిలిచిపోవడంతో.. సీడింగ్ ఆధారంగా భారత్ను విజేతగా ప్రకటించారు. దీంతో ఇండియాకు క్రికెట్లో స్వర్ణ పతకం ఖాయమైంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు సిల్వర్ మెడల్ వశమైంది. తొలుత టాస్ గెలిచిన తర్వాత ఇండియా.. ప్రత్యర్థిని బ్యాటింగ్కు ఆహ్వానించింది. 18.2 ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ 5 వికెట్లు కోల్పోయి 112 రన్స్ చేసింది. ఆ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ను ఆపేశారు. గ్రౌండ్ చిత్తడిగా ఉన్న నేపథ్యంలో మ్యాచ్ను రద్దు చేశారు. ర్యాంకింగ్స్లో భారత్ మెరుగ్గా ఉన్న కారణంగా.. స్వర్ణ పతకం మనకే దక్కింది. ఆసియా క్రీడల్లో పతకాల సెంచరీ కొట్టిన ఇండియా ఖాతాలోకి మరో పతకం వచ్చి చేరింది.