తప్పనిసరై ఎన్‌కౌంటర్‌..

తప్పనిసరై ఎన్‌కౌంటర్‌..

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటనలో నిందితులకు కఠిన శిక్ష విధించాలంటూ దేశవ్యాప్తంగా పెరుగుతున్న నిరసనలకు తెలంగాణ పోలీసులు ఊహించని విధంగా బదులిచ్చారు.దిశ హత్యాచార ఘటనకు సంబంధించి విచారణలో భాగంగా సీన్‌ రీకన్‌స్ట్రక్ట్‌ కోసం దిశను కాల్చేసిన ప్రాంతానికి తీసుకెళ్లిన పోలీసులు నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసి పారేశారు.ఆ సమయంలో తమ వద్దనున్న ఆయుధాలు లాక్కోవడానికి ప్రయత్నించారని అది సాధ్యం కాకపోవడంతో రాళ్లతో దాడి చేసి పారిపోవడానికి యత్నించగా తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరిపామని కాల్పుల్లో నలుగురు నిందితులు అక్కడిక్కడే మృతి చెందారంటూ పోలీసులు వెల్లడించారు. ఈ విషయాన్ని కమిషనర్‌ సజ్జన్నార్‌తో నిర్ధారించారు. దిశపై హత్యాచారం జరిపిన నిందితుల ఎన్ కౌంటర్ ను సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ధ్రువీకరించారు. “నిందితులు మహమ్మద్ ఆరిఫ్, నవీన్, శివ, చెన్నకేశవులు తెల్లవారుజామున షాద్‌నగర్‌, చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారుఅని ఆయన స్పష్టం చేశారు. ఘటన 3 నుంచి 6 గంటల మధ్య జరిగిందని తెలిపారు. తాను ఘటనా స్థలికి వెళ్లానని, మరిన్ని వివరాలను తరువాత తెలియజేస్తానని అన్నారు.ఇదే విషయమై దిశ హత్య కేసు నిందితులు పోలీసులపై కాల్పులు జరిపారని, పరిస్థితుల్లో తప్పనిసరై తాము ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. ఉదయం తనను కలిసిన మీడియాతో మాట్లాడిన ఆయన, తెల్లవారుజామున సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం నిందితులను ఘటనా స్థలికి తీసుకుని వచ్చినట్టు తెలిపారు. సమయంలో నిందితులు పోలీసుల ఆయుధాలను లాక్కున్నారని, వెంటనే ఫైరింగ్ ను పెన్ చేశారని తెలిపారు. ఆత్మ రక్షణార్థం జరిపిన కాల్పుల్లో వారు మరణించారని, తామేమీ ఎన్ కౌంటర్ చేసి వారిని హతమార్చాలన్న ఆలోచనలో లేమని స్పష్టం చేశారు.
ఎక్కడ కాల్చేశారో అక్కడే చచ్చారు..
చటాన్ పల్లి జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జ్ కింద, ఎక్కడైతే దిశను దారుణంగా కాల్చేశారో, అక్కడికి సరిగ్గా 300 మీటర్ల దూరంలో నిందితులు ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు మృతదేహాలు చెల్లాచెదరుగా పడి కనిపిస్తున్నాయి. సీన్ రీకన్ స్ట్రక్షన్ సమయంలో వీరంతా పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసుల ఆయుధాలు లాక్కోవడంతో పాటు రాళ్లను విసురుతూ పొలాల మీదుగా పరిగెత్తేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపి వారిని హతమార్చిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం వీరి మృతదేహాలు పొలాల మధ్య 30 మీటర్ల విస్తీర్ణంలో పడివున్నాయి. ఈ ప్రాంతంలో చుట్టూ గుబురుగా ఉన్న చెట్లు, పొదలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మృతదేహాలను పరిశీలిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు, మరికాసేపట్లో వీటిని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తారని తెలుస్తోంది. భారీగా తరలివస్తున్న ప్రజలను నియంత్రించడం క్లిష్టతరంగా మారిందని పోలీసులు అంటున్నారు

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos