కరోనా సోకిన వ్యక్తిని పసిగట్టే సాధనం

కరోనా సోకిన వ్యక్తిని పసిగట్టే సాధనం

లండన్ : కరోనా సోకిన వ్యక్తిని పసిగట్టే సాధనం- కోవిడ్ అలారం ను బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కరోనా బాధితుల నుంచి ఒకింత విభిన్నమైన వాసన వస్తుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే తేల్చారు. ఆ వ్యక్తి శరీరం నుంచి వెలువడే వాసనను ‘కొవిడ్ అలారం’ విశ్లేషించి నిర్ధారణ చేస్తుంది. వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (విఒసి) లో మార్పులే ఇందుకు కారణం. వీరిలో ప్రధానంగా కీటోన్, ఆల్డిహైడ్కు సంబంధించిన పదార్థాలు ఉంటాయని శాస్త్రవేత్తలు వివరించారు. వాసన పసి గట్టేందుకు ఎల్ఎస్హెచ్టిఎం, రోబోసైంటిఫిక్ లిమిటెడ్, దర్హామ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆర్గానిక్ సెమీ కండక్టింగ్ సెన్సరలు అందులోబిగించారు. ఒక గదిలో ఎవరైనా 15 నిమిషాల వ్యవధిలో కరోనా వైరస్ బారిన పడ్డారా లేదా అనే విషయాన్ని ఈ సెన్సార్ గుర్తిస్తుంది. విమానం క్యాబిన్లు, కేర్ హోంలు, తరగతి గదులు, కార్యా యాలలో ఈ సాధనాన్ని అమర్చినట్లయితే ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. కేంబ్రిడ్జ్షైర్ ఆధారిత సంస్థ రోబో సైంటిఫిక్ చేత సృష్టించబడిన ఈ పరికరం కోవిడ్ సోకిన వారి వాసనను 98-100 శాతం వరకూ గుర్తించింది. పీసీఆర్ పరీక్షల కంటే వేగంగా ఇది గుర్తించగలదు. 54 మందిపై ఈ పరీక్షలు జరిపినపడు 27 మందికి కోవిడ్ సోకినట్లు తేల్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos