విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం

విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం

న్యూ ఢిల్లీ: పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 9.4 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టంగా పొగ కమ్మేసింది . దట్టమైన పొగ మంచు కారణంగా విజిబిలిటీ సరిగా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారత వాతావరణ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో విజిబిలిటీ 125 మీటర్లకు పడిపోయింది. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లోని వివిధ ఎయిర్ పోర్టుల్లో ఎదుటి వస్తువే కనిపించటం లేదు. ఢిల్లీలోని పాలెం విమానాశ్రయం, అమృత్సర్, ఆగ్రా, గ్వాలియర్, ప్రయాగ్రాజ్, జైసల్మేర్ విమానాశ్రయాల్లోఇదే పరిస్థితి నెలకొంది. దీంతో జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దట్టమైన పొగ మంచు కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక మరికొన్ని విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరాల్సిన ఆరు విమానాలను సైతం దారి మళ్లించినట్లు వెల్లడించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు వెళ్లాల్సిన UK897 విమానం, ముంబై నుంచి హైదరాబాద్కు బయలుదేరిన UK873 విమానం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తిరిగి బెంగళూరుకు దారి మళ్లించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos