అగ్నీపథ్ కు వ్యతిరేకంగా తీర్మానం

అగ్నీపథ్  కు వ్యతిరేకంగా  తీర్మానం

చండీగఢ్: అగ్నీపథ్ రక్షణ నియామక పథకానికి వ్యతిరేకంగా పంజాబు శాసనసభ గురువారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రవేశ పెట్టిన ఈ తీర్మానానికి భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దేశ యువతకు ఈ పథకం వ్యతిరేకమని మాన్ అన్నారు. విపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ప్రతాప్ బజ్వా అగ్నిపథ్ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా చేసిన తీర్మానానికి తామూ బేషరతుగా మద్దతు ఇచ్చినట్లు అకాలీదళ్ నేత మన్ప్రీత్ సింగ్ అయాలీ ప్రకటించారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేకంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అనేక చోట్ల నిరసనకారులు రైళ్లు తగలబెట్టారు. ఈ ఘటనల్లో కొంత మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos