ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్‌ కేసులు..ఎక్కువ శాతం బీజేపీకి చెందినవారే

ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్‌ కేసులు..ఎక్కువ శాతం బీజేపీకి చెందినవారే

న్యూ ఢిల్లీ: : లోక్సభలోని 514 మంది సిట్టింగ్ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ అధ్యయనంలో వెల్లడైంది. గతంలో ఎంపీలు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించిన ఏడీఆర్ పలు వివరాలతో నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. ఎంపీల్లో 5 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. వీరి ఒక్కొక్కరి సంపద రూ.100 కోట్లకు పైమాటే. క్రిమినల్ కేసులు నమోదైన వారిలో 29 శాతం మందిపై హత్య, హత్యాయత్నం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, అపహరణ, మహిళలపై నేరాలకు పాల్పడటం లాంటి తీవ్రమైన కేసులు ఉన్నాయి. మొత్తం 9 మందిపై హత్య కేసులు నమోదుకాగా.. వారిలో ఐదుగురు బీజేపీకి చెందినవారే. 28 మందిపై హత్యాయత్నం కేసులు నమోదైతే.. వారిలో 21 మంది బీజేపీకి చెందినవారే కావడం గమనార్హం. మహిళలపై నేరాలకు సంబంధించి 16 కేసులు, 3 లైంగికదాడి కేసులు నమోదయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos