మహిళలను కించపరచడం మగతనమా?

  • In Film
  • March 26, 2019
  • 159 Views
మహిళలను కించపరచడం మగతనమా?

తమిళ సీనియర్‌ నటుడు రాధారవి చేసిన వ్యాఖ్యలపై సినీనటి నయనతార స్పందించారు.అందుకు సంబంధించి పత్రికా ప్రకటన విడుదల చేశారు.నా వృత్తిపర ధర్మం గురించి ఎవరైనా అవమానకర వ్యాఖ్యలు చేస్తే స్పందించడం నా బాధ్యత కాబట్టి స్పందిస్తున్నానన్నారు.మహిళలను కించపరుస్తూ మాట్లాడడాన్ని కొంతమంది మగతనం అనుకుంటున్నారని నయనతారు సీనియర్‌ నటుడు రాధారవిపై విరుచుకుపడ్డారు.నువ్వు కూడా ఒక తల్లికే జన్మించావని కానీ మీలాంటి వ్యక్తులు ఈ విషయాన్ని విస్మరించి మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేస్తూ అదే మగతనంగా భావిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.తన గురించి అందరూ మాట్లాడుకోవాలనే సంచుకిత భావంతో రాధారవి మహిళ గురించి అవమానకర వ్యాఖ్యలు చేశాడని రాధారవి అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నా కొంతమంది వ్యక్తులు చప్పట్లు కొడుతూ ప్రోత్సహించడాన్ని చూసి షాకయ్యానన్నారు. సీతాదేవి, దేవత, స్నేహితురాలు, భార్య,లవర్‌ చివరకు దెయ్యం పాత్రలతో పాటు ఏపాత్రనైనా కేవలం నా అభిమానులను అలరించడానికి చేస్తుంటానని నయనతార పేర్కొన్నారు.ఇక రాధారవిపై వెంటనే చర్యలు తీసుకోవడం తనకు మద్దతుగా నిలిచినందుకు  డీఎంకే నేత స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలిపిన నయనతార తనకు మద్దతుగా నిలిచిన నటీనటులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos