ఈడీ క‌స్ట‌డీ నుంచే రెండో ఆదేశం ఇచ్చిన సీఎం కేజ్రీవాల్‌

ఈడీ క‌స్ట‌డీ నుంచే రెండో ఆదేశం ఇచ్చిన సీఎం కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆరోగ్య శాఖకు కొత్త ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలను ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సౌరభ భరద్వాజ్కు కమ్యూనికేట్ చేశారు. జైలులో ఉన్నా కూడా.. సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల ఆరోగ్య గురించి ఆందోళన చెందుతున్నారని, ఆయన తనకు కొన్ని ఆదేశాలు జారీ చేశారని మంత్రి సౌరభ్ వెల్లడించారు. ఢిల్లీలోని కొన్ని మొహల్లా క్లినిక్లు, ఆస్పత్రులు ఉచిత మందులు ఇవ్వడం లేదని, కొన్నింటిల్లో ఫ్రీ టెస్టులు నిర్వహించడం లేదన్న విషయాన్ని కేజ్రీవాల్ తనకు చెప్పారని, ఆ సమస్యలను పరిష్కరించాలని ఆయన తనను కోరినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ తొలుత ఆదివారం మొదటి ఆదేశం ఇచ్చారు. నగరంలో నీటి, సీవేజ్ సమస్యలను పరిష్కరించాలని ఆయన మంత్రి ఆతిష్కు ఆదేశాలు జారీ చేశారు.సీఎం కేజ్రీవాల్ను మార్చి 21వ తేదీన అరెస్టు చేశారు. ఆయన్ను మార్చి 28వ తేదీ వరకు కస్టడీలో ఉంచనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos