సీఏఏపై కేజ్రీవాల్ కన్నెర్ర..

సీఏఏపై కేజ్రీవాల్ కన్నెర్ర..

న్యూ ఢిల్లీ: పొరుగు దేశాల్లో అణచివేతకు గురవుతున్న మైనారిటీ వర్గాలకు పౌరసత్వం కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏపై విపక్షాలు మండిపడు తున్నాయి. ఇది ఎలక్షన్ స్టంట్ అని, ఎన్నికల సమయంలో మాత్రమే కమలం పార్టీకి ఇలాంటి విషాలు గుర్తుకు వస్తాయని విమర్శలు గుప్పిస్తున్నాయి. దిల్లీ సీఎం కేజ్రీవాల్ బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. దేశ ఆర్థిక సమస్యల నుంచి దృష్టిని మళ్లించేందుకే సీఏఏ ను తీసుకువచ్చారని ఆరోపించారు. సీఏఏ ద్వారా పాకిస్థాన్, బంగ్లాదేశ్ వాసులకు భారతదేశంలోకి తలుపులు తెరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికే కాకుండా రాష్ట్రాలకు సైతం పెను విధ్యంసం కలిగించే చర్యగా కేజ్రీవాల్ అభివర్ణించారు. ‘‘పాకిస్థాన్, బంగ్లాదేశ్ నివాసితులకు బీజేపీ భారతదేశ తలుపులు తెరిచింది. ఇది దేశానికి ప్రమాదకరం. ఈశాన్య రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. ముఖ్యంగా అసోం వాసుల ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారుల కారణంగా అసోం ఇప్పటికే ప్రభావిత మవు తోంది. అలాంటి అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పించాలని బీజేపీ కోరుకుంటోంది.’’అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos