రాజ్ థాకరే అయోధ్య పర్యటన వాయిదా

రాజ్ థాకరే అయోధ్య పర్యటన వాయిదా

ముంబై: మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే తన అయోధ్య పర్యటనను వాయిదా వేసుకున్నట్లు శుక్రవారం ప్రకటించారు. దీనికి గలఅ కారణాల్ని పూణెలో 22న నిర్వహించనున్న ర్యాలీలో చెప్తానన్నారు. థాకరే అయోధ్య పర్యటనపై అక్కడి వారి నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. గతంలో ఆయన ఉత్తర భారతీయులపై విరుచుకుపడ్డారు. ఉత్తర ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. నటుడు అమితాబ్ బచ్చన్ మహారాష్ట్ర పట్ల విధేయతను కూడా ప్రశ్నించారు. వీటన్నిటినీ గుర్తు చేస్తూ యూపీ, బిహార్కు చెందిన నేతలు రాజ్ థాకరే అయోధ్య పర్యటనను తీవ్రంగా వ్యతిరించారు. ఉత్తర భారతీయులకు క్షమాపణ చెప్పిన తర్వాతే అయోధ్యకు రావాలని బీజేపీ నేతలు ఆగ్రహించారు. ఉత్తర భారతీయులకు నెంబర్ 1 శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది రాజ్ థాకరేనేనని, ఆయనను అయోధ్యలో అడుగు పెట్టనివ్వబోమని జేడీయు హెచ్చరించింది. కొన్ని రోజులుగా బీజేపీకి సన్నిహతంగా ఉంటూ వస్తోన్న రాజ్ థాకరేకు ఎన్డీయే కూటమి నుంచే ఎక్కువ వ్యతిరేకత రావడంతో పర్యటన వాయిదా వేసుకోక తప్పలేదని అంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos